Monday, June 26, 2017

అరవైలో ఇరవై


అరవైలో ఇరవై కోసం చేసే కసరత్తులు కావివి.. 
అనుభవాలతో ఆరితేరిన సారాంశ గుణపాఠాలు 
పాత తరానికేం తెలియదని గేలి చేసేరు కుర్రకారు 
పిల్లకాకులకేం తెలుసునని ఉండేలు దెబ్బలు.. 
తెలివితేటలతో ఆలోచనల్లో అంబరాన్ని తాకుతారు 
అరిటాకులతో పోల్చినా అన్నింటా మిన్న స్త్రీలు.. 
తెర ముందు తెర వెనుక అవసరం నేడు నటనలు
నేటి తరానికి ఆవేశం ఎక్కువ ఆలోచనలు తక్కువ 
కష్టపడకుండా కావాలనుకుంటారు ధనవంతులు.. 
ఉన్నంతకాలం హాయిగా నవ్వుతూ నవ్వించక 
కడకు ఒంటరేనని తెలిసీ ఎందుకీ తాపత్రయాలు.. 
చీకటివెలుగుల్లా వచ్చిపోతాయి సమస్యలు సంతోషాలు 
ఏదేమైనా ఎంజాయ్ చేసేద్దాం రండి మన జీవితాలు!!

6 comments:

  1. ప్రేరణాత్మకం.

    ReplyDelete
  2. మీ ఆలోచనలు ఆచరణ ప్రేరణలు మాడం.

    ReplyDelete
  3. హాయిగా హుషారుగా జల్సా చేద్దాం జీవితాన్ని అంటారా!

    ReplyDelete
  4. నేటి తరానికి ఆవేశం ఎక్కువ ఆలోచనలు తక్కువ
    కష్టపడకుండా కావాలనుకుంటారు ధనవంతులు..నిజం

    ReplyDelete