Wednesday, August 16, 2017

!!కాలమహిమ!!

సింహము గాయపడిందని గర్జించడం మాని గాభరాపడితే 
ఎలుక కూడా దానిపై ఎగిరెగిపడి గెంతుతూ ఆటపట్టించేను..
కుక్కలేమో దాని పనైయ్యిందని మొరిగేను!
ఎవరికి తెలిసినా తెలియక పోయినా
ఇదంతా కాలమహిమని సింహానికి తెలుసును
కలసిరాని కాలంతో చేతులుకలిపి సన్నిహితులే శత్రువులైనా
ఉచ్చులెన్నో వేసి చిక్కుల్లోపడేసి గాయపరచినా
సింహము చిన్నబోయేనా...
ఆకలి వేసిందని గడ్డి తినునా!?
అప్రమత్తంతో ఆలోచించి పరిస్థితుల్ని పల్టీ కొట్టించి..
మరల సింహగర్జనతో చిందులేయకపోవునా!!

5 comments:

  1. కాలాన్ని కాస్దని ఏమీ చేయలేని పరిస్థితి మనది

    ReplyDelete
  2. కాల పరీక్షను మించిన పరీక్షలు వున్నవా..?

    ReplyDelete
  3. కాలం ముందు అందరూ తలవంచి చేయాలి సలాం

    ReplyDelete
  4. పులి ఎప్పటికైనా పులే.

    ReplyDelete
  5. రారాజు ఎప్పటికీ తలవంచడు.
    చక్కటి కవిత మాడంగారు

    ReplyDelete