Monday, August 28, 2017

!!గడిచిన కాలం!!

క్షణాలన్నీ బాటసారులై సాగిపోయాయి.. 
జ్ఞాపకాలు మాత్రం రహదారిలా మిగిలాయి
సమయం ఉన్నప్పుడు ఆస్వాధించలేదు
జీవితాన్ని నమ్మి సాధించింది ఏంలేదు 
గూడల్లుకునే ధ్యాసలో పూర్తిగా మునిగితినేమో
ఎగరడానికి రెక్కలున్న విషయమే మరిచిపోయా
సంతోషాన్ని జీవితంతో ఖరీదుకట్టి కొనొచ్చనుకున్నా 
ఆనందం అదృష్టవంతులకే దక్కుతుంది కానీ 
అమ్ముడయ్యేది కాదనీ ఆలస్యంగా తెలుసుకున్నా!

7 comments:

  1. గూడల్లుకునే ధ్యాసలో పూర్తిగా మునిగితినేమో
    ఎగరడానికి రెక్కలున్న విషయమే మరిచిపోయా superb.

    ReplyDelete
  2. క్షణాలన్నీ బాటసారులై సాగిపోయాయి..touching lines

    ReplyDelete
  3. జీవితం చేజారితే ఏం చేయలేము
    అవకాశం ఉన్నప్పుడే ఆస్వాధించాలి

    ReplyDelete
  4. మీరు జీవితాన్ని ఎంత అనుభవించారో అంతకు రెట్టింపు అందంగా వ్రాస్తారు.

    ReplyDelete
  5. చేతులు కాలిన తరువాత
    ఆకులను పట్టుకోవడం..
    కడుపు నిండినాక
    కమ్మని భోజనం కోరడం..
    అన్నీ అయిపోయిన తరువాత
    ఆలోచించి విచారించడం..
    అస్సలు మంచిది కాదు

    ReplyDelete
  6. నేను ఒక ఇసుక పువ్వును
    అందినట్లే అంది చేజారిపోతాను

    ReplyDelete
  7. నమస్కారం _/\_
    మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
    తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/

    కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.

    ReplyDelete