ఇసుక రేణువులు నీటిలోన మెరిసి
దూరపు కొండలు నున్నగా కనబడి
కనులకి ముసుగేసి గారడీ చేసాయి!
గమ్యాలు గతులు తప్పి గాభరాపెట్టి
అస్థిత్వాన్ని చింపి చెల్లాచెదురు చేసి
జీవితమంటే ఇదేనంటూ నిలదీసాయి!
బంజరు కలలబీటల్ని కన్నీరుతడిపి
మనోవాంఛలు మూకుమ్మడై కలబడి
కస్తూరి సుగంధాన్ని కోరుతున్నాయి!
అనుబంధాలు అవసరానికి అల్లుకుని
బంగారులేడిలా మభ్యపెట్టి మసిపూసి
బింబానికి ప్రతిబింబాన్ని జతచేసాయి!
ఆశచావని విరిగిన మనసు పురివిప్పి
ఒంటరి సామ్రాజ్యపు రాజు రాణి తానని
బూజుల విసనకర్ర విసురుతున్నాయి!
వ్యధలు నవ్వుతూ స్వీకరిస్తారు.
ReplyDeleteచాలా మంచి కవితను అందించారు.
ReplyDeleteమీ ఆవేదన అక్షరాలకు నేను ఫిదా పద్మారాణీగారు.
ReplyDeleteగమ్యాలు గతులు తప్పి గాభరాపెట్టి
ReplyDeleteఅస్థిత్వాన్ని చింపి చెల్లాచెదురు చేసి
touching lines..
బింబానికి ప్రతిబింబాన్ని జతచేసి...అద్భుతమైన భావం.
ReplyDeleteబంజరు కలలబీటల్ని కన్నీరుతడిపి
ReplyDeleteమనోవాంఛలు మూకుమ్మడై కలబడి
కస్తూరి సుగంధాన్ని కోరుతున్నాయి!superb