Monday, September 11, 2017

!!భయానికే భయం!!

భయానికి నా నవ్వంటే ఎంతో భయం
పెదవులపై ఉన్న నవ్వూ దర్పం చూసి 
నా మనసులో దాగి ఉన్న ఆవేదనను  
కష్టనష్టాల్లో కూడా పలుకరించి పోదు!

వ్యధలు ఎన్ని ఉన్నా ఎదలోనే దాచేసి 
పైకి గంభీరంగా నవ్వే నేనంటే కన్నీటికి
తెలియని అసూయా అసురక్షిత భావం 
అందుకే ఏడుపు రమ్మన్నా దరిరాదు!

4 comments:

  1. ఎంత అదృష్టవంతులండి..!

    ReplyDelete
  2. నవ్వునే ఆత్మబలం అనుకుని సాగండి

    ReplyDelete
  3. నవ్వుతూ బ్రతకడం ఎంతో అదృష్టం

    ReplyDelete
  4. మీకు నవ్వు దేవుడు ఇచ్చిన వరం.

    ReplyDelete