బతుకమ్మ రావమ్మ బ్రతుకు చల్లగా చూడమని
రకరకాల పూలతో నవరాత్రులు పూజించేటోళ్ళు
నవమాసాలు మోసి బ్రతుకునిచ్చిన అమ్మలను
అత్తమ్మలను రమ్మని పిలిచే వారు కరువాయె
వృధ్ధాశ్రమాల్లో వదిలేసి పలుకరించైనా రారాయె!
రోజుకో రకపు పిండివంటతో దేవికి నైవేద్యం పెట్టి
పనికి జీతాలు పండుగ బోనస్లు కావాలనేటోళ్ళు
రక్తాన్ని పాలుగా చేసి పొత్తిళ్ళ పొదిగి దాచుకుని
పెంచి పెద్దచేసినోళ్ళ కడుపుకింత తిండి పెట్టరాయె
పైగా ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదని నిందలాయె!
నాలుగు దిక్కులా జైజై మాతాజీ అంటూ కేరింతలు
దిక్కులేని ఒంటరి మాతాజీల ఎన్నో కన్నీటిగాధలు!
నైతికంగా దిగజారుతున్న విలువల్ని ప్రశ్నలుచేసి అడిగారు.
ReplyDeleteమానవతా విలువలు
ReplyDeleteకొరవడినవి
అందుకే కామోసు
యాత్రిక జీవనం
అలవడినది