Saturday, January 23, 2010

నా జ్ఞాపకాలు.

నా మెదటి పోస్టింగ్ కాజీపేట్ హాస్పిటల్లో వేసినప్పుడు ప్రతిఒక్కరూ ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చి అక్కడ అన్నలు, అక్కలు ఉంటారు వాళ్ళతో జాగ్రత్త అని చెపితే అదేంటి అందరిళ్ళలో ఉండరా ఏంటి అని మనసులో అనుకున్నా పైకి అంటే ఇంకో నాలుగు ఉచిత సలహాలని ఇచ్చేస్తారని భయపడి. ఈ అన్నలు అక్కలు అంటే వాళ్ళ దృష్టిలో నక్సల్స్ అని తరువాత తెలుసుకున్నాననుకోండి అది అప్రస్తుతం..... అలా హాస్పిటల్ లో అడుగిడిన నన్ను అందరూ సాదరంగా ఆహ్వానించి స్టాఫ్ అందరినీ పరిచయం చేసారు. పదిరోజులు కాజీపేట్ హైదరాబాద్ మధ్య తిరుగుతూ గడిచి పోయాయి. తరువాత కాజీపేట్ లో ఒక పోర్షన్ అద్దెకు తీసుకుని ఉన్నాను. ఇలా రోజులు గడుస్తున్నాయి.
ఒకరోజు నేను హాస్పిటల్ కి వెళుతుంటే దారిలో "గుడ్ మార్నింగ్ మాడం" అంటూ ఆరడుగుల అందగాడు కాస్త మాసిన గెడ్డంతో నన్ను పలుకరించాడు.అది మొదలు రోజూ హాస్పిటల్ వరకు నా వెనుక, ఇంటికి వెళ్ళేటప్పుడు నా ముందు రావడం దినచర్యగా మారింది. అడుగుదాము ఎందుకు ఇలా రోజూ వెంటపడుతున్నావు అనుకున్నా కాని....అమ్మో! అన్నేమో మనల్ని ఏమీ అనడంలేదుకదా అని ఊరుకున్నా. ఇలా రెండు వారాలు గడిచాయి. ఆరోజు అతను నాకు కనపడలేదు నిజం చెప్పాలంటే నా కళ్ళుకూడా ఏమైంది ఈరోజు రాలేదు అని వెతికాయనుకోండి....
హాస్పిటల్ లో అడుగు పెట్టగానే ఎదురుగుండా ఆ కుర్రాడు "గుడ్ మార్నింగ్" అంటూ నవ్వుతూ కనిపించాడు మనసు హాయిగా అనిపించింది. అది మొదలు అలా రోజూ హాస్పిటల్ కి రావడం విష్ చేసి మెడిసిన్ తీసుకుని ఔట్ పేషెంట్ బ్లోక్ లోనుండి నన్ను చూసి కొద్దిసేపటికి వెళ్ళిపోవడం. ఒకరోజు ఉండలేక అడిగాను ఎందుకు ఇలా రోజు వస్తావు నీకు ఏం పనిలేదా అని కాస్తవిసుగ్గా.... దానికి చిరునవ్వు నవ్వి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అని వెళ్ళిపోయాడు. ఎందుకో నేను అంత విసుగ్గా అడిగి ఉండవలసింది కాదు అనుకున్నాను మనసులో. ఆ తరువాత అతను కనిపించలేదు. రోజూ అతను కనపడతాడని నాకళ్ళు వెతికేవి కాని అతను ఇక ఎప్పటికీ కనపడని లోకానికి వెళ్ళిపోయాడని, అతనికి బ్రెయిన్ ట్యూమర్ వుందని కాస్త మతిస్తిమితం కూడా తప్పిందని తరువాత మా సీనియర్ స్టాఫ్ చెపితే తెలిసింది. మనసంతా భారమైంది.....
కొద్దిరోజుల తరువాత......ఒకరోజు కంప్లెండ్స్ బాక్స్ తెరచి చూస్తే అందులో నాకు అతను వ్రాసిన లేఖ కనపడింది, దాని సారాంశం నేను వాళ్ళ అక్కలా వుంటానని వాళ్ళక్కా బావా ఇతనికి ట్రీట్మెంట్ ఎక్కడ చేయించ వలసివస్తుందో అని వదిలేసారని. వాళ్ళ అమ్మానాన్న మంచీర్యాల ట్రయిన్ ఆక్సిడెంట్ లో పోయారని. ఆ ఉత్తరం చదువుతుంటే నాకు తెలియకుండానే కళ్ళవెంట నీళ్ళు రాలాయి. నిన్న కాజీపేట్ పనిమీద వెళ్ళి వస్తుంటే నా పాత జ్ఞాపకాలు నన్ను తడిమాయి....
వాటిలో ఒకటి ఇలా మీముందు!!!

Tuesday, January 19, 2010

ఈరోజు ఉదయాన్నే లేచిపోయా!

రేపు ఉదయాన్నే తప్పకుండా లేచి మొదలు పెట్టాల్సిందే...
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంక దీన్ని ఆపకూడదు, ఏవిటి బొత్తిగా ఇంత బద్దకం పెరిగిపోయింది అప్పట్లో ఎంతటి చలాకితనం ఉత్సాహం ఉండేవి నాలో అవన్నీ ఏమైపోయాయి,ఇలాగైతే మున్ముందు ఇంకా కష్టం.ఇదే కనుక కొనసాగితే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఏమైనాసరే మరల మునుపటి నేను నేనుగా మారవలసిందే ఇంక రేపు ఉదయం లేచిపోయి పారిపోతున్నా! అచ్చు తప్పు తప్పు...పరిగెడుతున్నా అంటే వడివడిగా నడిచేస్తానని ఇలా ఆరునెలల్లో అరవైసార్లు అనుకుని ఉంటాను. ఇలా రాత్రి పడుకునేటప్పుడు అనుకోవడం ప్రొద్దున్నే బద్దకించడం అలవాటైన నాకు నాశరీరం కూడా సహకరించడంతో వాకింగ్ షూ పాడై మూడురోజుల్లో కొత్తవి కొనుక్కొని మొదలుపెడదాంకదా అనుకున్నది ఆరునెలలు పట్టిందన్నమాట.
ఇందులో గొప్పేముంది వెళితే ఆశ్చర్యపోవాలి కాని అంటారా! నిజమేనండి....కాని ఈరోజు ఉదయాన్నే అయిదున్నరకి నేను లేచిపోయి తయారై కొత్త షూ వేసుకుని పరిగెట్టేసానుగా అందుకే ఈ ఆనందం అన్నమాట.
ఏదో ఆరునెలల నడకనంతా కవర్ చేయాలి అన్న భావోద్రేకంలో పరుగు తీసానే కాని ఆఫీసులో కాళ్ళంతా ఒకటే నొప్పి, ఇంటికివచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కాని రాత్రి ఒకేసారి పడుకుందామని ఇలా రిఫ్రెష్ అయి మీతో పంచుకుంటే కాస్త నొప్పి మరచిపోతానని ఆశన్నమాట.
ఏవండో...మరచిపోయాను ఈ నడక ఇకముందు ఎటువంటి విఘ్నాలు లేకుండా సాఫీగా సాగాలని కోరుకుని నన్ను ప్రోత్సహిస్తారు కదూ!

Wednesday, January 13, 2010

పండుగ కాంక్షలు

భోగి మీకు భోగభాగ్యాలనివ్వాలని
సంక్రాంతి సుఖఃసంతోషాలనివ్వాలని
కనుమ కష్టాలని తొలగించాలని
కోరుకుంటూ.....
మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!

Monday, January 11, 2010

ఇటుకలతో ఇంటర్వ్యూ!

ఏవండోయ్....మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే కాస్త ఒక లుక్ ఈ పోస్ట్ వైపు వేయండి సార్!!!!!!

ఏదో నా తరపునుండి ఓ చిరుసలహా.....

కొన్ని ఇటుకలున్న గదిలోకి కొందరిని పంపండి, తలుపులు వేసి కిటికీ నుండి చూసేలా అమర్చుకోండి.... కొన్ని గంటల తరువాత తెరచిచూస్తే మీకే అర్థమౌతుంది.
ఇటుకలని లెక్కపెడుతుంటే వాళ్ళని అకౌంట్స్(Accounts)డిపార్ట్మెంట్.
లెక్కించిన వాటినే మరలమరల లెక్కపెట్టేవాళ్ళని ఆడిటింగ్(Auditing).
ఇటుకలని ఒకదానిపై ఒకటి పేరుస్తుంటే ఇంజినీరింగ్(Engineering).
వాటిని వివిధ రూపాల్లో అమరుస్తుంటే వాళ్ళని ప్లానింగ్(Planning).
ఒకవేళ ఎవరైనా ఆ గదిలో నిదురపోతుంటే వాళ్ళని సెక్యూరిటీ(Security).
ఇటుకలని ముక్కలు చేస్తుంటే ఆలోచించకుండా వాళ్ళని ఇంఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology).
ఖాళీగా గదిలో కూర్చున్న వాళ్ళని హుమన్ రిసోర్స్(Human Resources).
ఎన్ని విధాల ప్రయత్నించినా ఒక్క ఇటుకని కూడా కదపలేని వాళ్ళని మార్కెటింగ్&సేల్స్ (Marketing&Sales).
కిటికీ నుండి బయటికి చూస్తున్న వాళ్ళని స్ట్రాటజిక్ ప్లానింగ్(Strategic Planning).
ఇంక ఆఖరిన కబుర్లు చెప్పుకుంటూ ఒక్క ఇటుకని కూడా కదపలేని వాళ్ళని అత్యుత్తమ మానేజ్ మెంట్ (Management) పోస్టులో ఉంచి సత్కరించండి:):):):)

Thursday, January 7, 2010

లాస్కార్ గివార్డ్!

శుక్లాం భరధరం విష్ణుం అని బ్లాగ్ మొదలుపెడదాం అనుకున్న నాకు బ్లాగ్ ఆరంభోత్సవానికి కాస్త వెరైటీగా తెలుగోళ్ళ అత్తూఊఊఊఊ..త్తమ అవార్డులను వెల్లడించమని గాలికబురు వచ్చిందే తడవు ఆగగలనా చెప్పండి????
ఆగలేనని
అర్థం అయింది కదండి!!!!
మరింకెందుకు
ఆలస్యం అంటారా????
అయితే
అందుకోండి.... నా ఆరంభ లస్కార్ అవార్డ్(Exclusive : Oscar Awards For Politicians) హాస్య గుళికలని జస్ట్ ఫర్ ఫన్!!!!!
హియర్
ఈజ్ యాన్ అవార్డ్ ఫర్ బెస్ట్ యా..యా...అంతొదంటారా?
అయితే
ఓకె.... మీరే చూడండి:):):)

Best Actor 2009 - కెసిఆర్












Best Silent character Artist 2009 - చంద్రబాబునాయుడు












Best Over Actor 2009 - లగడపాటి రాజ గోపాల్














Best Comedian 2009 – చిరంజీవి













Best Romantic Actor 2009 - N D
తివారి












Best Dubbing Artist 2009 – చిదంబరం









Best Spectator 2009 – రోశయ్య (New Entry)












Best Screenplay Direction 2009 - సోనియా గాంధీ












మరింక చూసారుగా కానీయండి..
ఘాట్టిగా చప్పట్లే కొడతారో!!
చీవాట్లే పెడతారో మీ ఇష్టం..
నా బ్లాగ్ కి ఇదేనా ఆహ్వానం:):)