Tuesday, January 19, 2010

ఈరోజు ఉదయాన్నే లేచిపోయా!

రేపు ఉదయాన్నే తప్పకుండా లేచి మొదలు పెట్టాల్సిందే...
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంక దీన్ని ఆపకూడదు, ఏవిటి బొత్తిగా ఇంత బద్దకం పెరిగిపోయింది అప్పట్లో ఎంతటి చలాకితనం ఉత్సాహం ఉండేవి నాలో అవన్నీ ఏమైపోయాయి,ఇలాగైతే మున్ముందు ఇంకా కష్టం.ఇదే కనుక కొనసాగితే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఏమైనాసరే మరల మునుపటి నేను నేనుగా మారవలసిందే ఇంక రేపు ఉదయం లేచిపోయి పారిపోతున్నా! అచ్చు తప్పు తప్పు...పరిగెడుతున్నా అంటే వడివడిగా నడిచేస్తానని ఇలా ఆరునెలల్లో అరవైసార్లు అనుకుని ఉంటాను. ఇలా రాత్రి పడుకునేటప్పుడు అనుకోవడం ప్రొద్దున్నే బద్దకించడం అలవాటైన నాకు నాశరీరం కూడా సహకరించడంతో వాకింగ్ షూ పాడై మూడురోజుల్లో కొత్తవి కొనుక్కొని మొదలుపెడదాంకదా అనుకున్నది ఆరునెలలు పట్టిందన్నమాట.
ఇందులో గొప్పేముంది వెళితే ఆశ్చర్యపోవాలి కాని అంటారా! నిజమేనండి....కాని ఈరోజు ఉదయాన్నే అయిదున్నరకి నేను లేచిపోయి తయారై కొత్త షూ వేసుకుని పరిగెట్టేసానుగా అందుకే ఈ ఆనందం అన్నమాట.
ఏదో ఆరునెలల నడకనంతా కవర్ చేయాలి అన్న భావోద్రేకంలో పరుగు తీసానే కాని ఆఫీసులో కాళ్ళంతా ఒకటే నొప్పి, ఇంటికివచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కాని రాత్రి ఒకేసారి పడుకుందామని ఇలా రిఫ్రెష్ అయి మీతో పంచుకుంటే కాస్త నొప్పి మరచిపోతానని ఆశన్నమాట.
ఏవండో...మరచిపోయాను ఈ నడక ఇకముందు ఎటువంటి విఘ్నాలు లేకుండా సాఫీగా సాగాలని కోరుకుని నన్ను ప్రోత్సహిస్తారు కదూ!

10 comments:

  1. keep walking!
    nenu unta meeku company. naadi same problem, vaayidaalu veyyadam

    ReplyDelete
  2. నాక్కూడా నడవాలని వుంటుంది కానీ మా షికాగోలో ఈ చలికాలంలో చాలా చల్లగా వుంటుందండీ. జిం మానివేసాను - డబ్బులు ఆదాచేద్దామని. హ్మ్. మళ్ళీ ఏదన్నా మొదలెట్టాలి.

    అలాగేనండీ ప్రోత్సాహానికేముంది - అలాగే ఇస్తాం. బాగా, క్రమం తప్పకుండా నడవండి - మీ ప్రోగ్రెస్ తెలియపరుస్తూ వుండండి. మరి మాకేంటి? మాక్కూడా కావాలి కూసింత ప్రోత్సాహం.

    ReplyDelete
  3. అమ్మో నా వల్ల కాదులెండి.
    నేనిక్కడే ఉంటాను. మీరునడుచుకుని వచ్చేయండి.అయినా మా స్కూల్లో పనే పేద్ద ఎక్స్ ర్సైజ్.
    But u keep walking, I keep watching....
    all the best.

    ReplyDelete
  4. ప్రేరణా, నేనందుకే పొద్దున్న కుదరదనే, హాయిగా సాయంత్రం వాకింగ్ పోయొస్తాను. హాయిగా అక్కడి స్నేహితులతో కాసేపు సొల్లుకబుర్లు కూడా వేసుకొస్తాను. మళ్ళీ కొత్తబలం తో ముందుకు కదలటమే. యాపీ,యాపీ వాకింగు, అని దీవిస్తున్నా!

    ReplyDelete
  5. హి హీ, ఈ పోస్ట్ టైటిల్ కొద్దిగా మార్చకూడదా? బ్లాగులోకంలో నాలాంటి వారు కూడా వుంటారండీ, వారికి వేరే అర్ధాలు ధ్వనిస్తాయి మరి !

    ReplyDelete
  6. శరత్ గారు అయితే మీరు కళాపోషకుల లిస్ట్ లో ఉన్నారన్నమాట!అర్థాలు మారితే పర్వాలేదు కాని అపార్థాలకి తావీయకండేం:):)

    ReplyDelete
  7. మీ నడక అప్రతిహాతమ్గా సాగి పొవాలన్టే లెచినప్పుడు యెలా వున్టె అలా వెళ్ళి పొవడమె.అన్టే షు లెదని ట్రాక్ సుట్ లెదని ఆగితె మున్దుకు పొలెరు.అలా అని మరీ మాక్సి తొ వెల్లిపొమ్మని కాదు .ఆ పైన మీ ఇస్టమ్.

    ReplyDelete