Wednesday, August 28, 2013

!!తప్పుచేస్తున్నా!!

సదా తప్పు చేస్తూనే ఉన్నాను....
ఆ తప్పుని జీవితాంతం భరిస్తాను!


నా ఒడిని కష్టాలముళ్ళతో నింపి
నీ మార్గంలో పూలెన్నో పరిచాను!


స్నేహమో శత్రుత్వమో ఏదేమైనా
నిస్వార్ధంగానే నీతో చేయికలిపాను!


మావిచిగురిని రుచి చూడాలనెంచి
కుహూ....అని కోయిలని పిలిచాను!


కన్నీటిధార చెంపన ఆరకపోయినా
పరిహారంగా నా నవ్వుని చెల్లించాను!


మదికంటిన మసిని కన్నీటితో కడగక
మోముపైన ధూళిని శుభ్రం చేసాను!

7 comments:

  1. Very nice.....touching

    ReplyDelete
  2. చిత్రము, కవిత రెండు చాలా బాగున్నాయండి.

    ReplyDelete
  3. చాలా అందమైన చిత్రంతో చిక్కని భావంతో ఆకట్టుకున్నారు.

    ReplyDelete
  4. ఈ కవిత ఎవరినో తలపింపజేస్తుంది

    ReplyDelete
  5. అందమైన భావాలు , అందమైన చిత్రం ..

    ReplyDelete
  6. కవిత చిత్రం రెండూ ఆకట్టుకున్నాయి.

    ReplyDelete