గోరుముద్దలుకొన్ని గోముగా తినిపించి
ముద్దులు ఎన్నో మూటల్లో పంచి పెంచి
ఆత్మవిశ్వాసం ఆభరణంగా అలంకరించి
చిరునవ్వనే ఆయుధాన్ని నీకు అందించి
నా ఆశలన్నీ నీ కళ్ళలో కలలుగా గాంచి
నాకు సాధ్యంకాని విజయం నీలో నే చూసి
ఆనందించే వేళలో నా ఆయువు నీకు పోసి
నీలో ఊపిరిగా ఉంటాను- అమ్మనుగా నేను!
అమ్మ ఓ అద్భుతమైన భావన . అమ్మను మించిన దైవం ఏముందీ ....రాణీగారు అమ్మ ఆశలు చాలా బాగున్నాయి.
ReplyDeleteఅమ్మ అనే పదానికి ఊపిరి పోస్తుంది మీ కవిత.
ReplyDeleteఅమ్మ ప్రేమను గోరుముద్దలా రుచి చూపారు ప్రేరణ గారు..
ReplyDeleteచిక్కనైన భావకవిత
ReplyDeleteగోరుముద్దలు కొన్ని గోముగా తినిపించి
ReplyDeleteఆత్మవిశ్వాసం ఆభరణం, చిరునవ్వు ఆయుధం గా
నా ఆయువు నీ ఊపిరిగా ఉంటాను నీడలా - అమ్మను నేను!
అమృత మూర్తి అమ్మ ను వస్తువు గా రాసుకున్న ఒక చక్కని భావన శిల్పం
అభినందనలు ప్రేరణ గారు!
సరిరాదు ఏదీ అమ్మమనసుకు
ReplyDeleteఅమ్మ ప్రేమను ఎంత బాగా చెప్పారు పద్మ గారు.
ReplyDelete"ఆత్మవిశ్వాసం ఆభరణంగా అలంకరించి"
ఇంతకంటే ఇంకేం కావాలి . గుండెకు హత్తుకునేలా ఉంది మీ కవిత
అమ్మ ఆప్యాయత రంగరించిన కవిత
ReplyDeleteగోరుముద్దలా గోముగా ఉన్నాయి మీ అమ్మ మనసులోని మాటలు
ReplyDeleteబ్లాగ్ లో అందరివీ అలరించే భావాలే నేను ఏం రాయగలను
ReplyDeleteAmma thinipinche gorumuddalaa madhuramgaa undi mee kavita prerana gaaru:-):-)
ReplyDelete