!!బ్రతుకుబాట!!
అభూతలోకంలో అంతుచిక్కని ప్రశ్నలున్నా
జీవితాన్ని చదివితే దొరికే జవాబులున్నాయి..
కట్టిన ఇష్ట ఇసుక సౌధాలెన్ని కూలిపోతున్నా
కలలు కాదంటూనే కళ్ళను కౌగలిస్తున్నాయి..
అడుగడుగున గుండె విఛ్ఛిన్నం అవుతున్నా
విరిగిన మనసుని అతికే మార్గాలు ఉన్నాయి..
ముసుగుమార్చి జీవించే జీవితాలు ఎన్నున్నా
మంచి మనిషి మనుగడలు కొన్ని ఉన్నాయి..
ఎదురు దెబ్బలు తగిలి గాయాలు అవుతున్నా
మలాం పూసి చేయందించే చేతులు ఉన్నాయి..
అదృష్టమాడే ఆటలో గెలుపోటములు ఎలాగున్నా
జీవించడానికి అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి..
అక్కడక్కడా బాధలు , నిరాశలు ఉన్నా ,వెనువెంటనే ఆశలు, నెరవేర్చుకుని ఆహ్లాదంగా నెమరువేసుకున్న తీపి గుర్తుల్ని కూడా పంచుకున్నారు .
ReplyDelete"అదృష్టమాడే ఆటలో గెలుపోటములు ఎలాగున్నా
జీవించడానికి అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి.."
- ముగింపు లోని పై మాటలు బాగా నచ్చాయి . మంచి కవితకు, మీ అందమైన నవ్వు మరింత అందాన్ని జోడించింది .
సూపర్
ఆశావాద కవిత్వం, చాలా బాగుంది.
ReplyDeleteమీ ఆశావాదం అద్భుతంగా వుంది రాణీగారు .
ReplyDeleteమనసు మంచిదయితే .... నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అని .... ఒకప్పుడు విన్నాను. చక్కని ఆశావహ కవిత .... చాలా బాగుంది
ReplyDeleteఅభినందనలు పద్మా రాణి గారు! శుభోదయం!!
కవిత బాగుంది
ReplyDeleteఏ బాధలున్నా సాగిపోయే మనోధైర్యాన్ని నింపేకవిత. మీ నవ్వు బాగుందండి.
ReplyDelete