Saturday, January 18, 2014

వెలిసినగోడ

వెలిసిపోయిన గోడలాంటి జీవితంలో

దాచుకోవడానికి ఏం మిగిలి ఉందని,

నాసిరకం బంధాల రంగునీరద్దడానికి?

తప్పులేవో బీటల్లో స్పష్టం అవుతుంటే

పునాది పటుత్వ సాంధ్రత తగ్గుతుంటే

అనురాగాలసెగ ఇటుకమదిని కాల్చక

భాంధవ్యాలు ఎండిన మట్టై రాలుతుంటే

కూలబోయే గోడల కోసం ఎదురుచూస్తూ

పడబోతే ఆపే ప్రయత్నమేదో చేస్తున్నట్లు

పాతపునాది పూడ్చి కొత్తది తవ్వుతుంటే!!

4 comments:

  1. వెలిసిన గోడ జీవితంలో
    పునాది పటుత్వత లేని తప్పులు ఎండిన మట్టై రాలుతూ
    కూలబోయే గోడలను ఆపే ప్రయత్నం .... ఇంక దాచుకోవడానికి ఏం మిగిలి ఉందని, నాసిరకం బంధాల రంగునీరద్దేందుకు?
    చాలా చాలా బాగా రాసారు ప్రేరణ గారు! అభినందనలు!!

    ReplyDelete
  2. పటుత్వం లేని భాందవ్యాల గూర్చి బాగా చెప్పారు రాణీగారు , బాగుంది .

    ReplyDelete
  3. పునాది పటుత్వ సాంధ్రత తగ్గుతుంటే
    అనురాగాలసెగ ఇటుకమదిని కాల్చక
    భాంధవ్యాలు ఎండిన మట్టై రాలుతుంటే... really nice analysis Padma Rani garu..

    ReplyDelete
  4. జీవితంలో అనురాగాలు , భాంధవ్యాలు కరువై నపుడు - ఓ చిన్న గుండెలో రగిలే భావోద్వేగ భావాలని ఎంత బాగా చెప్పారు ప్రేరణ గారు.
    ఆసాంతం చదివాక మనసు నిజంగానే బీటలు బారింది !
    శ్రీపాద

    ReplyDelete