చచ్చినోళ్ళ కళ్ళు చాటంత....
ఉన్నప్పుడు వారిపై లేనిచింత
పోయాక అందరూ చేరి చెంత
పొగిడేరు చర్చిస్తూ తలాకొంత
పలకనివారుసైతం పరామర్శిస్తూ...
మనుగడేమైనా కలిసేది మట్టిలోనని
ప్రాణమున్నప్పుడు చెప్పని సూక్తులతో
జీవంలేని శవాన్ని శుద్దిచేస్తారు అంతా
ఎందుకంటే ఆత్మశాంతంటూ పలికేరు వంత
బ్రతుకునలేని శాంతి చావులో కోరడమోవింత!
ప్రేరణగారు ఏమిటో ఈ వైరాగ్యం!
ReplyDeleteరాణీగారు చాలా బాగా చెప్పారు . నేటి సమాజంలో ఈ రకమైన కన్నీటి తుడుపు చర్యలు ఎక్కువై పోయాయి.వాస్తవాన్ని చక్కగా వివరించారు.
ReplyDeleteవాస్తవిక పదమాల
ReplyDeleteమనిషెప్పుడూ అంతే వింతగానే ప్రవర్తిస్తాడు దూరమయ్యాకే విలువల్ని గ్రహించి .... శుభోదయం ప్రేరణ గారు!
ReplyDeleteజీవితం అంటే ఇంతేనా!!
ReplyDelete
ReplyDelete" ప్రాణమున్నప్పుడు చెప్పని సూక్తులతో
జీవంలేని శవాన్ని శుద్దిచేస్తారు అంతా"
అవును మీ ఆలోచనలు అక్షరాలా నిజం !
అయితే ... మరో విధంగా చూస్తే ........ బ్రతికున్నన్నాళ్ళు ఓ వ్యక్తిని పేరుతొ పిలుస్తారు . అదే వ్యక్తీ చనిపోయాక "శవం" అనే సంభోదిస్తారు కాని ఎ ఒక్కరూ పేరును వాడరక్కడ - ఎంత విడ్డూరమిది. ఎంత వాస్తవాలు అని అనుకున్నా మనసెందుకో రాజీ పడట్లే .
శ్రీపాద
" ప్రాణమున్నప్పుడు చెప్పని సూక్తులతో
ReplyDeleteజీవంలేని శవాన్ని శుద్దిచేస్తారు అంతా"
అవును మీ ఆలోచనలు అక్షరాలా నిజం !
అయితే ... మరో విధంగా చూస్తే ........ బ్రతికున్నన్నాళ్ళు ఓ వ్యక్తిని పేరుతొ పిలుస్తారు . అదే వ్యక్తీ చనిపోయాక "శవం" అనే సంభోదిస్తారు కాని ఎ ఒక్కరూ పేరును వాడరక్కడ - ఎంత విడ్డూ రమిది. ఎంత వాస్తవాలు అని అనుకున్నా మనసెందుకో రాజీ పడట్లే
శ్రీపాద
Nijam chepparu prerana gaaru:-):-)
ReplyDeleteనిజాలు చెప్పారు
ReplyDelete