నీ మౌనానికి అలవాటైన నా మనసు చెవిటిదైతే
లోపం శరీరానిదేనని త్రోసిపుచ్చి సరిపుచ్చుకున్నా
మనసుకి గాయమై కన్నీటి మున్నీరుపాయై పారితే
కంటిలో నలకపడెనని నలుగురితోనని ఏమార్చుకున్నా
చెలిమిలోన లోపముండి చెంతకొచ్చి చేయిజారిపోతే
చెలిమి చేయడం నాకు చేతకాలేదని నిందించుకున్నా
తీర్పు చెప్పే కాలమే కఠినమై వేదనతో చేయికలిపితే
తీరు తెలియని తింగరి నేనని సమాధాన పరచుకున్నా
జీవితసారాంశమే ఇదని సముదాయించి సాగిపోమంటే
జీర్ణంకాలేని ఆవేదనని అణగార్చుకుంటూ నవ్వేస్తున్నా

Promote your Website or Blog for free and increase traffic to your site at http://forum.telugushortfilmz.com/
ReplyDeleteపద్మ గారూ !
ReplyDeleteజీవితంలో మనని వెన్నాడే
కిష్ట పరిస్థితులను ఓమారు
పునరావృత్తం చేసుకుని,
వాటిని ఎదుర్కునే విశ్లేషణా విధానం
చాలా బాగా విడమర్చి చెప్పారు.
ముఖ్యంగా.......
"జీవితసారాంశమే ఇదని సముదాయించి సాగిపోమంటే
జీర్ణంకాలేని ఆవేదనని అణగార్చుకుంటూ నవ్వేస్తున్నా"
అనే ముగింపుతో జీవిత సారాంశమే యిదని ,
వేదనలను సైతం అనగార్చుకుంటూ నవ్వేస్తూ,
పాఠకులకు మాత్రం రవంత భారాన్నే మిగిల్చారు .
చాలా బావుంది .
అభినందనలు మీకు పద్మ గారూ .
*శ్రీపాద
అలా నవ్వుతూ సాగండి.
ReplyDeleteనవ్వే మీకు నాకు స్ఫూర్తిదాయకం :-)
ReplyDeleteఇంతలా నవ్వగలిగే మీకు ఆ వేదనతో కూడిన రాతలెందుకో
ReplyDeleteనిజానికి మీ నవ్వే మీకు ఆత్మస్థైర్యం అదే మీ అయుధం. Keep always smiling.
ReplyDeleteజీవన సారాంశమే ఇది అని, జీర్ణం చేసుకోలేని మనస్థితి తో మనసులోనే అణచి వేసుకుంటూ .... నాలో నేను నవ్వుకుంటున్నా
ReplyDeleteఅభినందనలు పద్మ గారు! శుభోదయం!!
నన్ను "నవ్వుతో" సాగిపొమ్మని ప్రోత్సాహాన్ని ఇస్తున్న ప్రతి ఒక్కరికీ అభివందననములు.
ReplyDelete