Monday, June 23, 2014

!!భావోధ్వేగాలు!!

భావోధ్వేగాలు సంతలో సరుకులు ఏం కావు
బేరం చేసి లాభనష్టాలు బేరీజు వేయడానికి!!

భావాలేం విరబూయని మల్లెమొగ్గలు కావు
పరిమళమందించి వడలిపోయి రాలడానికి!!

భాధ్యతలు కొనుక్కునే ఆటబొమ్మలు కావు
ఆనందం కోసం ఆడుకుని విసిరివేయడానికి!!

భారంగా చేసిబాసలు ఎన్నడూ సఫలం కావు
అవసరంతీరాక ఎగవేసి చల్లగా జారుకోడానికి!!

భాంధవ్యాలేం వీధిలో అంగడి బొమ్మలు కావు
కొని కోరుకుంటే కొత్తరుచులు అందివ్వడానికి!!

7 comments:

  1. జీవితసత్యాలు

    ReplyDelete
  2. " భావాలేం విరబూయని మల్లెమొగ్గలు కావు
    పరిమళమందించి వడలిపోయి రాలడానికి!! "

    అవును.
    నూటికి నూరు పాళ్ళు నిజమే.
    "భావోద్వేగాలు ...
    భావాలు ...
    బాసలు ...
    భాద్యతలు ... "

    జీవన పయనంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఘడియలివి.
    ఇంతటి గొప్ప అంశాలను అలవోకగా విశదీకరించి ఓ మంచి 'తత్వం ' తో
    పాటు తగిన 'హితాన్ని ' కూడా భొధించారు మీ కవిత 'భావోద్వేగాలు' లో.

    మంచి ఆలోచనకు పటుత్వం గల పదాలు అందించారు.
    మీకిలాంటివి వెన్నతో పెట్టిన విధ్యే కదా పద్మారాణీ గారూ !

    అభినందనలు పద్మారాణీ గారూ
    *శ్రీపాద

    ReplyDelete
  3. అమ్మో ఇన్ని కావులని అవునులుగా మార్చడం కష్టమే.

    ReplyDelete
    Replies
    1. ఆకాంక్ష గారూ !
      చమత్కారంతో కూడిన స్పందనను అందించినా..
      కవిత లోతును అవగాహన చేసుకోవడం కష్టతరమే
      అని మీరు చెప్పినతీరు చాలా బావుంది.
      ప్రశంశనీయం కూడాను.
      *శ్రీపాద

      Delete
  4. పద్మా రాణి గారు! శుభోదయం!!
    భావోధ్వేగాలు, భావాలు, భరువులు, భాధ్యతలు భాంధవ్యాలు .... అన్నింటికీ న్యాయం చెయ్యాల్సింది మనమే అని చక్కని కవిత
    అభినందనలు

    ReplyDelete
  5. మనసు మూగగా రోధిస్తుందండి.

    ReplyDelete