నన్ను కాదని వెళ్ళిపోతూ...
పెదవిపై నవ్వు చెరగనీకు అన్నాడు!
అతని ఆనందాన్ని కాదనే హక్కు నాకేదని.
నవ్వుతూ అనుకున్నాను...
నేను పోగొట్టుకున్నది నాది కాదని!
అతడు కాదన్నది కేవలం తన సొంతమేనని.
బంధం బిగుతు సడలిపోయిందని...
అపార్థాల్లో పుట్టి, ప్రశ్నా జవాబు తానైనాడని
నేనడిగాను క్షణాల్లో ఊపిరెలా ఆగేనని?
నడుస్తూ పట్టుకున్న చేతిని కాదని వదిలేసాడు!
పెదవిపై నవ్వు చెరగనీకు అన్నాడు!
అతని ఆనందాన్ని కాదనే హక్కు నాకేదని.
నవ్వుతూ అనుకున్నాను...
నేను పోగొట్టుకున్నది నాది కాదని!
అతడు కాదన్నది కేవలం తన సొంతమేనని.
బంధం బిగుతు సడలిపోయిందని...
అపార్థాల్లో పుట్టి, ప్రశ్నా జవాబు తానైనాడని
నేనడిగాను క్షణాల్లో ఊపిరెలా ఆగేనని?
నడుస్తూ పట్టుకున్న చేతిని కాదని వదిలేసాడు!
అపార్థాల్లో పుట్టి, ప్రశ్నా జవాబు తానైనాడని
ReplyDeleteనేనడిగాను క్షణాల్లో ఊపిరెలా ఆగేనని? .... వెళుతూ
చాలా బాగుంది భావన
అభినందనలు ప్రేరణ గారు!
బాగుంది ప్రేరణగారు.
ReplyDeleteఅతడు కాదన్నది కేవలం తన సొంతమేనని.
ReplyDeleteబంధం బిగుతు సడలిపోయిందని... వేదనాత్మకతను పలికించారు ప్రేరణ గారు..