Sunday, February 1, 2015

!!మరో ప్రయత్నం!!

నిగ్రహమంటూ గోడపై నిటారుగా నిలబడి

దురాశతో యుద్ధమే చేసి ఓడిపోతే తెలిసే...

నేను మాత్రమే మారి ప్రయోజనం ఏమని

అన్నీ తెలిసినా ఏమీ తెలియని అజ్ఞానినని

పలుకులే పొదుపుగా వాడి పొగరుబోతునై

కలలనే కని కునుకుతో కయ్యాలాడి గెలిచి

నిదురనే రాక నిస్తేజంతో నిశీధిలో నిలబడి

ప్రయత్నమే చేసి పైకి ఎగరలేక పడిపోయి

గాయాలనే కప్పేసి గాట్లకే కుట్లు వేసుకుని

మరోసారి నిలబడ ప్రయత్నిస్తే తప్పులేదని!!

5 comments:

  1. పలుకులే పొదుపుగా వాడి పొగరుబోతునై
    కలలనే కని కునుకుతో కయ్యాలాడి గెలిచి
    నిదురనే రాక నిస్తేజంతో నిశీధిలో నిలబడి
    ఈ లైన్స్ చాలా చాలా నచ్చేసాయండి.

    ReplyDelete
  2. దురాశతో యుద్ధమే చేసి ఓడిపోతే తెలిసే...
    ఈ ఒక్క లైన్ తో తెలిసింది మీరు ఎంత ప్రాక్టికలో. మంచికవితను అందించారు,

    ReplyDelete
  3. మరో ప్రయత్నం తప్పదు. స్పూర్తిదాయక కవిత

    ReplyDelete
  4. నిదురనే రాక నిస్తేజంతో నిశీధిలో నిలబడి
    ప్రయత్నమే చేసి పైకి ఎగరలేక పడిపోయి

    ReplyDelete
  5. మీ కవిత చదివి మేము కూడా పడిలేచి మరో ప్రయత్నం చేయాలనిపిస్తుందండి. ప్రేరణాత్మక కవిత

    ReplyDelete