Saturday, February 7, 2015

!!చౌక బేరం!!

ఈ అనంతకాల గమనంలో...
నా రవ్వంత జీవిత పయనంలో
ఎన్నెన్నో తెలియని మలుపులతో
సుధీర్ఘ ప్రయాణమెన్నో కష్టాలతో..సాగి
నల్లని శిరోజాలు తెలుపుగా మారెనే..కానీ
లోకంతీరు మాత్రం తెల్లబడలేదు ఎందుకనో!
నమ్మకం కానక నీరసించి వీధిలో వెతకలేక
గమ్యం ఏగూటికి ఏగెనని ఎవరినీ అడగలేక
బజారులో నమ్మకత్వం ఖరీదు ఎంతని అడిగితే
అందరూ నవ్వుతూ ఒకే సమాధానం చెప్పారెందుకో!
"నమ్మకమే నగ్నంగా నడిబజారులో నిలబడితే చూడలేక
మానవత్వం ఎప్పుడో కారుచవకగా అమ్ముడైపోయిందని"

5 comments:

  1. ఇంకా నాణ్యతా నమ్మకం అని ప్రాకులాడ్డం ఎందుకు మేడం. ఎలాగూ అమ్ముడైపోయాయి. అన్నింటినీ కప్పిపుచ్చి నవ్వుతూ సాగిపోవడమే :-)

    ReplyDelete
  2. చాలా చక్కగా వున్నది .

    మంచి మంచి పద ప్రయోగాలు కవితకు వన్నె తెచ్చాయి .

    ReplyDelete
  3. మరో ప్రేరణాత్మక కవిత

    ReplyDelete
  4. అయ్యో కొనుక్కుందాం అనుకునేలోపే అమ్ముడైపోయిందా :-(

    ReplyDelete

  5. "నమ్మకమే నగ్నంగా నడిబజారులో నిలబడితే చూడలేక మానవత్వం ఎప్పుడో కారుచవకగా అమ్ముడైపోయిందని" ఒకే సమాధానం
    నిజమే మానవత్వం స్థాయి కాళ్ళక్రిందకు చేరింది
    అభినందనలు ప్రేరణ గారు!

    ReplyDelete