బ్రతుకు ఖాతాలో అసలు జమా కాలేదు
ఊపిరి రుణంగా మారి ఇంకా మిగిలుంది!
చెల్లించిన జీవితం వడ్డీలా కాలంలో కలిస్తే
అసలు ఆశగా మారి పెరిగిపోతూనే ఉంది!
తీరాలన్న కోరిక రెక్కలు లేకనే ఎగరబోవ
ఆనందం ఎండినాకులా మారి నేలరాలింది!
నిజం కాని కల మరో కొత్త ఆశతో చిగురిస్తే
విచారమేదో సుడిగాలిలా మారి చుట్టేసింది!
అంచనాలే గజ్జకట్టి అంబరాన్న చిందేయబోవ
నకిలీనవ్వు సంరక్షణగా మారి తైతక్కలాడింది!
ఊపిరి రుణంగా మారి ఇంకా మిగిలుంది!
చెల్లించిన జీవితం వడ్డీలా కాలంలో కలిస్తే
అసలు ఆశగా మారి పెరిగిపోతూనే ఉంది!
తీరాలన్న కోరిక రెక్కలు లేకనే ఎగరబోవ
ఆనందం ఎండినాకులా మారి నేలరాలింది!
నిజం కాని కల మరో కొత్త ఆశతో చిగురిస్తే
విచారమేదో సుడిగాలిలా మారి చుట్టేసింది!
అంచనాలే గజ్జకట్టి అంబరాన్న చిందేయబోవ
నకిలీనవ్వు సంరక్షణగా మారి తైతక్కలాడింది!
జీవితం మరణించేవరకు తీరని ఋణమే ప్రేరణగారు.
ReplyDeleteఅసలు తీర్చడం ఎలా అని ఆలోచిస్తూ వడ్డీ కడుతూ వగచడం ఎందుకండి. మీ అస్త్రం నవ్వు. నవ్వుతూ నవ్వించండి. :-)
ReplyDeleteనకిలీ నవ్వు నర్తించనీగాక..
ReplyDeleteమీ నవ్వు నాణ్యతకి చిహ్నం.
అంత సులభంగా తీరిపోవండీ బంధాలు. కవిత చాలాబాగుంది.
ReplyDelete