పని చేస్తే ఒక గుర్తింపు, అడుగేస్తే గుర్తు పడనీయి
బ్రతుకుదేముంది బజారులో కుక్కా బ్రతుకుతుంది
జీవిస్తే నీ చరిత్రని కలకాలం గుర్తుగా ఉండిపోనీయి
తల్లికి కూడెట్టక అమ్మోరికి దీపధూపనైవేధ్యాలు పెట్టి
భక్తిలో అమ్మనేం చూసేవు తల్లిలో దైవాన్ని చూసేయి
గది తీసుంటేనే లోనున్నది బొగ్గో బంగారమో తెలిసేది
మనిషి అన్నీ ఉన్న అంగడైతే మాటనే తాళం వేసేయి
కాలమే నిర్ణయిస్తుంది ఎవరికి ఎంత ప్రాప్తమో అన్నది
పనికొచ్చే నలుగురిని ఉంచి పనికిరాని వందా వదిలేయి
సంతోషమే సిరి ఆత్మవిశ్వాసమే ఎవరు దోచుకోలేని నిధి
ఆరోగ్యమే అంతులేని సంపద అని గుర్తు ఉంచుకోవోయి!!
పని చేస్తే ఒక గుర్తింపు కావాలి.True
ReplyDeleteబ్రతుకు విలువ గురించి బాగాచెప్పారు
ReplyDeleteఏం చెప్పారు
ReplyDeleteచాలా చాలా బాగుంది ప్రేరణగారు
ReplyDelete