Friday, June 5, 2015

కొన్నిసార్లు


కొన్నిసార్లు...ఆశల పై అంచనాలు అధికంగా వేసి  
మన మనోవేధనకి మనమే కారణం అవుతాము!

పలుమార్లు...ఆత్మస్థైర్యంతో భాధని నవ్వుతూ గెలిచి 
ఒంటరిపోరాటంతో అనుకున్నవి కొన్నైనా సాధిస్తాము! 

చాలాసార్లు...అసలు విషయం ఏమిటనేది వదిలివేసి 
మన దృష్టితో అంచనా వేసి హైరానా పడుతున్నాము! 

ఎన్నోమార్లు...రాయి విసిరినంత సులువుగా భాధపెట్టి 
గాయం లోతెంతో చూడకనే మన్నించమని కోరుతాము! 

అనేకసార్లు...సంపద పోతే సర్వం పోయిందని ఏడ్చి
ధైర్యం కోల్పోయి అసలు జీవితాన్నే కోల్పోతున్నాము!

3 comments:

  1. ఎన్నోమార్లు...రాయి విసిరినంత సులువుగా భాధపెట్టి
    గాయం లోతెంతో చూడకనే మన్నించమని కోరుతాము! నిజం కదా

    ReplyDelete