లంగరేసి ఒడ్డునున్న లాంచికేం తెలుసు
నడిసముద్రంలో తెడ్డులేని నావ గురించి
మనసు లేని బండరాయికి ఏం తెలుసు
మనోఃభావ అలజడుల సంకీర్తన గురించి!
దాహం అంటూ గోలచేసే నేలకేం తెలుసు
నరికేసిన చెట్టు కార్చలేని కన్నీటి గురించి
ఎండిపోలేకున్న ఎదపొరలకి ఏం తెలుసు
ఆవిరైపోయిన చిరాశల సెలయేటి గురించి!
ఆకాశంలో విహరించే విహంగానికేం తెలుసు
భారమైన మేఘాలు కార్చే వర్షధార గురించి
ఫలధీకరణ దాల్చిన పుప్పొడికి ఏం తెలుసు
విచ్చుకోకనే రాలిపోయిన పువ్వుల గురించి!
నడిసముద్రంలో తెడ్డులేని నావ గురించి
మనసు లేని బండరాయికి ఏం తెలుసు
మనోఃభావ అలజడుల సంకీర్తన గురించి!
దాహం అంటూ గోలచేసే నేలకేం తెలుసు
నరికేసిన చెట్టు కార్చలేని కన్నీటి గురించి
ఎండిపోలేకున్న ఎదపొరలకి ఏం తెలుసు
ఆవిరైపోయిన చిరాశల సెలయేటి గురించి!
ఆకాశంలో విహరించే విహంగానికేం తెలుసు
భారమైన మేఘాలు కార్చే వర్షధార గురించి
ఫలధీకరణ దాల్చిన పుప్పొడికి ఏం తెలుసు
విచ్చుకోకనే రాలిపోయిన పువ్వుల గురించి!
దాహం అంటూ గోలచేసే నేలకేం తెలుసు
ReplyDeleteనరికేసిన చెట్టు కార్చలేని కన్నీటి గురించి
ఎండిపోలేకున్న ఎదపొరలకి ఏం తెలుసు
ఆవిరైపోయిన చిరాశల సెలయేటి గురించి
Excellent lyrics
లంగరేసి ఒడ్డునున్న లాంచికేం తెలుసు
ReplyDeleteనడిసముద్రంలో తెడ్డులేని నావ గురించి
మొదటి వాక్యాలతోనే బంధించారు. చాలా బాగుందండి.
నిజమే మాకేం తెలీదు.
ReplyDeleteమీ కవితల్లో లోతైన భావం ఉంటుంది.
ReplyDeleteదాహం అంటూ గోలచేసే నేలకేం తెలుసు
ReplyDeleteనరికేసిన చెట్టు కార్చలేని కన్నీటి గురించి..
తెలియకే వర్షాలు కురవడం లేదేమో :-)
అధ్భుతంగా చెప్పారండి.
ReplyDeleteనర్మగర్భితంగా వ్రాసిన చేదునిజాలివి ప్రేరణ రాణిగారు
ReplyDelete