Friday, August 7, 2015

!!ఏం తెలుసు!!

లంగరేసి ఒడ్డునున్న లాంచికేం తెలుసు
నడిసముద్రంలో తెడ్డులేని నావ గురించి
మనసు లేని బండరాయికి ఏం తెలుసు
మనోఃభావ అలజడుల సంకీర్తన గురించి!

దాహం అంటూ గోలచేసే నేలకేం తెలుసు
నరికేసిన చెట్టు కార్చలేని కన్నీటి గురించి
ఎండిపోలేకున్న ఎదపొరలకి ఏం తెలుసు
ఆవిరైపోయిన చిరాశల సెలయేటి గురించి!

ఆకాశంలో విహరించే విహంగానికేం తెలుసు
భారమైన మేఘాలు కార్చే వర్షధార గురించి
ఫలధీకరణ దాల్చిన పుప్పొడికి ఏం తెలుసు
విచ్చుకోకనే రాలిపోయిన పువ్వుల గురించి!

7 comments:

  1. దాహం అంటూ గోలచేసే నేలకేం తెలుసు
    నరికేసిన చెట్టు కార్చలేని కన్నీటి గురించి
    ఎండిపోలేకున్న ఎదపొరలకి ఏం తెలుసు
    ఆవిరైపోయిన చిరాశల సెలయేటి గురించి
    Excellent lyrics

    ReplyDelete
  2. లంగరేసి ఒడ్డునున్న లాంచికేం తెలుసు
    నడిసముద్రంలో తెడ్డులేని నావ గురించి
    మొదటి వాక్యాలతోనే బంధించారు. చాలా బాగుందండి.

    ReplyDelete
  3. నిజమే మాకేం తెలీదు.

    ReplyDelete
  4. మీ కవితల్లో లోతైన భావం ఉంటుంది.

    ReplyDelete
  5. దాహం అంటూ గోలచేసే నేలకేం తెలుసు
    నరికేసిన చెట్టు కార్చలేని కన్నీటి గురించి..
    తెలియకే వర్షాలు కురవడం లేదేమో :-)

    ReplyDelete
  6. అధ్భుతంగా చెప్పారండి.

    ReplyDelete
  7. నర్మగర్భితంగా వ్రాసిన చేదునిజాలివి ప్రేరణ రాణిగారు

    ReplyDelete