సూర్యుడు ఇంకా సద్దుమణగలేదు
పచ్చని చెట్లు ఆకులు రాల్చలేదు
కాస్తాగి...ఓపికతో వేచి ఉండండి
ఓటమి నన్ను ఇంకా వరించలేదు
కాస్తంత ప్రయత్నం చేయనివ్వండి
ఓడిపోతే నేనే తిరిగి పయనమైపోతాను
పోరాటం ఏదో పూర్తి కానివ్వండి
త్వరలో ఎలాగో పరాభవించబడతాను
కొద్దిగా పేరుప్రతిష్టలు ఏవో రానివ్వండి!!
ఉన్నతంగా ఎదిగిపొండి
ReplyDeleteఅలాగేనండి ☺
ReplyDelete