Wednesday, June 15, 2016

!!ఆశలు!!

ఆనందం ఎక్కడా అమ్ముడుకాదు  
ఆవేదనా మనకోసం అమ్మబడదు
ఆలోచనల్లో అవకతవకలనుకుంటా
వాటికి మందుమాకులేం ఉండవు!

కోరికలతో కొట్టుమిట్టాడు మనిషిని
మూర్ఖత్వం కౌగిలించుకుని వీడదు
సరిదిద్ది సంధి చేసుకోవాలనుకుంటే
ఆపసోపాలతో అగచాట్లపాలయ్యేవు!

ఆశలకి లొంగితే నీకు నీవే పిడిబాకు
మితిమీరితే జీవితంపై పుట్టు చిరాకు  
ఆకాంక్షలు అంతంలో చేసేను గాయం
అయినా జీవితాంతం మనల్ని వీడవు!


4 comments:

  1. జీవిత సత్యాలని కాచివడపోసిన సారమిది. చాలా బాగారాశావు.

    ReplyDelete
  2. బుచికోయమ్మ బుచికి. ఏందమ్మా ఈ పిచ్చి తవికలు.

    ReplyDelete