అణగలేమని అంటూ హాస్యం చేసి ఆట పట్టిస్తున్నాయి!
వయసు పైబడి పెంచుకున్న కోరికల్లోని ప్రోత్సాహం తగ్గి
నీరసం కౌగిలంటే జీవితోత్సాహాలు సన్నగిల్లుతున్నాయి!
పంటి క్రిందవేసి పట్టుదారాన్నే కొరకలేని వృధ్ధపరువానికి
పనిలేని పరిపక్వాలు తోడున్నామంటూ పిలుస్తున్నాయి!
యవ్వనంలో తీరకుండా బోల్తాపడ్డ పసిడికలలు నిద్రలేచి
అరిగిన ఆలోచన్లకి ఆకురాయితో పదును పెడుతున్నాయి!
పరుగు తీయాల్సిన ప్రాయంలో పట్టనట్లు పడుకున్న ప్రేమ
ఇప్పుడు ప్రాకులాటతో గుండెలయల్ని వేగం చేస్తున్నాయి!
ముగ్ధమనోహరమైన మోముపై రంగులు మెరవలేక వెలసి
నిద్రపోతే జ్ఞాపకాలు జోలపాటంటూ భయపెడుతున్నాయి!
అమాయకపు హృదయం పసిపిల్లలా గెంతులువేయాలని
చేసే ప్రయత్నాలు ప్రయాసపడి లేస్తూ కుంటుతున్నాయి!
వాహ్..మీ వ్రాతలు వాస్తవానికి దర్పణాలు. కంటికి కట్టినట్లు వ్రాస్తారు.
ReplyDeleteపేరే పదునుగా ఉందంటే పోయం లో మరింత పస ఉన్నట్లే .
ReplyDeleteచాలాఅందంగా అల్లిన అక్షరమాల బాగుంది.
ReplyDeleteపంటి క్రిందవేసి పట్టుదారాన్నే కొరకలేని వృధ్ధపరువానికి
ReplyDeleteపనిలేని పరిపక్వాలు తోడున్నామంటూ పిలుస్తున్నాయి
పచ్చి నిజాలు సుతిమెత్తగా వ్రాసారు.