Monday, June 20, 2016

!!డామిట్ అడ్డం!!

డామిట్...విచిత్ర విన్యాసమదేమో మోహానిది మమతది
నిర్మల నిశ్చింతలని కోరుకుంటాము ముళ్ళై గుచ్చుకుంటే!

దక్కిందేదో మిగిలిందేదోనన్న ఆలోచనలే దండుగ ఏమో
వచ్చిపోయే సుఖధుఃఖపు వెలుగునీడల దాగుడుమూతల్లో!

కనులారా చూడలేదు కొలువనే లేదు భగవంతుని మదిలో
అయినా నా పై నేను వశము తప్పుతాను నిదురపోతుంటే!

జనం నవ్వుని ఆనందపు అందలాన్న ఎక్కించి ఊరేగిస్తారు
కానీ...వాస్తవానికి వగచి ఊరట పడితేనే కదా ఉపశమనం!

5 comments:

  1. డామిట్...విచిత్ర విన్యాసమ

    ReplyDelete
  2. మీరు వ్రాసినవి బాగున్నాయి.

    ReplyDelete
  3. జీవిత సత్యాలు చెప్పడం మీ తరువాతే.

    ReplyDelete
  4. నిజంగానే జీవితం ఒక విచిత్రవిన్యాసం

    ReplyDelete
  5. జనం నవ్వుని ఆనందపు అందలాన్న ఎక్కించి ఊరేగిస్తారు
    కానీ...వాస్తవానికి వగచి ఊరట పడితేనే కదా ఉపశమనం!

    ReplyDelete