Wednesday, January 4, 2017

!!మృత్యువు!!

నేను నమ్మిన వారే నన్ను మోసగిస్తే

గాయమైన గుండెకే గాయమౌతుంటే

నిజాయితీ లేని వారు సైతం నీతి చెప్ప

కొరగాని వారు కూడా కోపంతో చూడగా

కుళ్ళు కుతంత్రాలు కబళించి కన్నుగీట 

ఇష్టంలేని క్రియలే కౌగిలించి కాటువేయ

భయపడతాయి అనుకున్నవి బంధించ 

మృత్యువుని మాత్రం మోహించి రమ్మని

బాహటంగా పిలువ భయమేలనో దానికి!

5 comments:

  1. వాస్థవాలే అయినప్పటికీ...మృత్యువుతో మొదలు పెట్టడం సబబుగా లేదండి..

    ReplyDelete
  2. జీవిత సత్యాలు ..
    జీర్ణించుకోవడం బహుకష్టం ..
    అభివర్ణన అమోఘం ..

    ReplyDelete
  3. కొరగాని వారు కూడా కోపంతో చూడగా, కుళ్ళు కుతంత్రాలు కబళించి కన్నుగీట..లోకంతీరు ఇంతే.

    ReplyDelete
  4. నిజాయితీ లేని వారే నీతులు చెబుతారు
    చేతకాని వారు ఎదుటివారి పై నిందలు వేస్తారు

    ReplyDelete