నోటిమాట వినే వారే అందరూ
మనసు పడే వేదన వినరెవ్వరూ
శబ్దాలతో మారుమ్రోగు సంతలో..
నిశ్శబ్దాన్ని గుర్తించేవారు ఉండరు
అక్కరకురాని ఎన్నో ఆలోచనలు
ప్రేమ సంపాదన బంధాలు అంటూ
అనవసర చర్చలు సమావేశాలు..
ఆర్జించింది ఎంతో కోల్పోయిందేమిటో
తెలుసుకునే ప్రక్రియలో ఫలితం శూన్యం
శతాబ్దాలుగా దొర్లుతున్న పరిశోధనలో
సాగుతూనే ఉంది శాంతి కొరకు శోధన!!
Nice..దొరికే వరకు శోధించండి.
ReplyDeleteఈ శోధనకు అంతం ఉండదు.
ReplyDeleteమన ప్రశ్నలకు సమాధానము లభించదు.