సుఖఃసాధనాల నడుమ యాంత్రికజీవులు
అనుభూతుల్ని దాచే దర్పాలు ఢాంబికాలు
మసకల ముసుగులో అనిశ్చల గమ్యాలు
అలరించే రంగుల్లో రాగంలేని అనురాగాలు
మమతలకు మరకలు అంటి అరమరికలు
ఆదరణ ఆప్యాయతలు జ్ఞాపకపు చిహ్నాలు
ఆనందాల్ని సుడిగుండంలోకి నెట్టిన వ్యధలు
నిరాశ నిట్టూర్పుల్తో బంధించబడ్డ బ్రతుకులు
సంతోషాలని సంతలో వెతుక్కునే ప్రాణులు
నేటి కృత్రిమ హైటెక్ ఆశ్చర్యకర జీవితాలు!!
నేటి కార్పొరేట్ జీవితాలు
ReplyDeleteరంగులు వేసిన రాళ్ళు
అక్షరాలు అన్ని నిజాలు
అర్థవంతం మీ కవిత
ReplyDeleteనేటి హైటెక్ బ్రతుకులు ఇంతే.