Thursday, May 31, 2018

!!అస్తమించిన ఆశ!!

నన్ను నేను రాటుదేల్చుకుంటున్న కొద్దీ..
చావని ఆశలు రాచరికపు మర్యాదలు కోరుతూ
మదిని వేదనా రుసుము కట్టమని వేధిస్తున్నవి!

సున్నితత్వం బిడియపడలేనంటున్న కొద్దీ..
బింకం బిగుసుకుని బానిసత్వాన్ని పిలుస్తూ 
భస్తాల కొద్దీ దుఃఖాన్ని భుజాలపై మోయమని   
తనకేమీ వద్దంటూ భారీమూల్యం అడుగుతుంది!

ఆత్మాభిమానాన్ని కుదవుపెడుతున్న కొద్దీ..
నా అనిశ్చల అస్తిత్వం నన్ను అలుసు చేస్తూ
ఎదను కోసిన వారి పంచన చేరి ప్రశంసించమని
ప్రాధేయపడి జీవితాన్ని పణంగా పెట్టి పరిగెడుతూ 
జీవనగడియారపు ముల్లు ఆగేదాకా తిప్పుతుంది!

2 comments:

  1. నిండైన నవ్వుతో కప్పేసిన వ్యధలు ఎన్నో

    ReplyDelete
  2. మీరు చాలా బాగారాస్తారు.

    ReplyDelete