Sunday, June 30, 2013

సాగిపోదాం!!

ఎవరి జీవితం వారికెంతో ఇష్టం
చావంటే ఎవరికీ కాదు ప్రియం
బంధాలు విడలేని వింతజాడ్యం
తెలిసి చేస్తారు కన్నీటితో స్నేహం

రంగులెన్నో చూపుతుంది జీవితం
మనవారే పగైపోతారు కొంతకాలం
మనసు విరిగి కలతచెందిన దినం
జీవితానికి ఎక్కడిది మరో జననం

మదిలోనే ఆశలన్నీ అణచివేద్దాం
కనుల వెనుక భాధలని దాచేద్దాం
ముఖకవళికలకి మౌనం నేర్పేద్దాం
పెదవులపై నవ్వులద్ది సాగిపోదాం!!

Sunday, June 23, 2013

విపత్తే కనువిప్పు

ఈ విపత్తు దేవుని సంకల్పమా!
లేక మానవుని స్వార్థమా????
ప్రకృతి వైపరీత్యాల చిహ్నమా!
లేక హెచ్చరికా పరిణామమా???
దేవ దర్శన భాగ్యమా!
లేక పాపాలకి చెల్లించిన పరిహారమా??
పుణ్యాన్వేషణా ఫలమా!
లేక జల ప్రళయతాండవ నృత్యమా?

మానవ విపరీతార్థబుధ్ధికీ వినాశ విషాదమొక తాత్కారణం...
ఈ పరిణామం మానవజాతికి కనువిప్పై చూపాలి పరిష్కారం!

Sunday, June 16, 2013

Happy Father's Day

 "అమ్మ" అన్నప్పుడు కలిసే పెదవులు....
"నాన్న" అని పిలిచేటప్పుడు విడిపోతాయి!
అన్నీ అయి ఆలించి పెంచేది......"అమ్మ"
ఎదపై ఎక్కించుకుని ఆడించేది....."నాన్న"
"అమ్మ" ఆయువు పోసి ఊపిరినిస్తే....
"నాన్న" హాయిగా ఊపిరిపీల్చనిచ్చే దోహదకారి!
"అమ్మ" జన్మకు ఆదిమూలం "నాన్న" దానికి బీజం

Saturday, June 15, 2013

ఇలాచేయకు

కలల నీలాకాశంలో....
ఊహల తారల్ని చూడకు!
కపటాన్ని కప్పిన నవ్వులో....
కారుణ్యాన్ని అన్వేషించకు!
సులువైన ఢొంక దారిలో....
మనఃశాంతి కావాలని కోరకు!
సకల ఐశ్వర్యాల వేటలో...
ఆనందంగా జీవించాలనుకోకు!
సొంతలాభపు చింతలో....
పరులను కష్టాలకు గురిచేయకు!

Thursday, June 13, 2013

పాపాలతో

పావలా కాక పదిరూపాయిలు అడుక్కుంటే....
పావుశేరు గంజిబియ్యం కాక పాయసమొస్తుందా!
పాతగుడ్డ కాక కొత్త గోచీపీలిక దొరుకుతుందా!

పాపాలు చేసి పాహి పాహీ అని అరిస్తే....
పాపము పుణ్యంగా మారి సంతోషాన్నిస్తుందా!
పాతాళం కాక స్వర్గం రారమ్మని పిలుస్తుందా!