Sunday, June 23, 2013

విపత్తే కనువిప్పు

ఈ విపత్తు దేవుని సంకల్పమా!
లేక మానవుని స్వార్థమా????
ప్రకృతి వైపరీత్యాల చిహ్నమా!
లేక హెచ్చరికా పరిణామమా???
దేవ దర్శన భాగ్యమా!
లేక పాపాలకి చెల్లించిన పరిహారమా??
పుణ్యాన్వేషణా ఫలమా!
లేక జల ప్రళయతాండవ నృత్యమా?

మానవ విపరీతార్థబుధ్ధికీ వినాశ విషాదమొక తాత్కారణం...
ఈ పరిణామం మానవజాతికి కనువిప్పై చూపాలి పరిష్కారం!

4 comments:

  1. మీరన్నది నిజమే ప్రేరణ గారు. మానవ వినాశకర అభివృద్ధి నమూనాల విపరిణామమే ఈ హిమాలయ విలయానికి కారణం. మనిషి తాను కూచున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖత్వం నుండి బయటపడాలి ఇకనైనా. లేకపోతే శివుడైనా గంగ లయ విన్యాసంలో మిగలనట్టుగా కొట్టుకుపోవాల్సిందే. Timely post.. congrats..

    ReplyDelete


  2. ప్రకృతి వైపరీత్యాల చిహ్నమా!True.

    ReplyDelete
  3. చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete