Sunday, June 30, 2013

సాగిపోదాం!!

ఎవరి జీవితం వారికెంతో ఇష్టం
చావంటే ఎవరికీ కాదు ప్రియం
బంధాలు విడలేని వింతజాడ్యం
తెలిసి చేస్తారు కన్నీటితో స్నేహం

రంగులెన్నో చూపుతుంది జీవితం
మనవారే పగైపోతారు కొంతకాలం
మనసు విరిగి కలతచెందిన దినం
జీవితానికి ఎక్కడిది మరో జననం

మదిలోనే ఆశలన్నీ అణచివేద్దాం
కనుల వెనుక భాధలని దాచేద్దాం
ముఖకవళికలకి మౌనం నేర్పేద్దాం
పెదవులపై నవ్వులద్ది సాగిపోదాం!!

3 comments:

  1. జీవితం కాచి వడబోసినట్లే ఉంది ప్రేరణ గారు.

    ReplyDelete
  2. చివరి నాలుగు లైన్లలో జీవితాన్ని చూపారు.

    ReplyDelete