Monday, August 12, 2013

!!సర్దుబాటు!!

ఒంటరి బాటసారిపై ఇంత వలపెందుకు
అతకని తాడుని కతికేలా ముళ్ళెందుకు
దక్కదని తెలిసాక తగని మక్కువెందుకు
కలసిరాని కాలంలో కలిసి కలవరమెందుకు

ఒకరంటే పడిచస్తాను అనడమే ప్రేమకాదు
వెర్రిగా వెంటపడి వేధించడం వివేకమేంకాదు
ప్రేమని పొందడమే ప్రేమకి పర్యవసానంకాదు
దక్కనివాటిపై వ్యామోహమది విరహమేకాదు

ఆశలున్నా అందరికీ నెరవేరేది మాత్రం కొందరికి
ఎగసినకెరటాల్లో కొన్నిమాత్రమే చేరతాయి ఒడ్డుకి
మనసుపడే తపన ఏం తెలుసు కలలుకనే కళ్ళకి
సర్దుకోక తప్పదు మనకీ మరోసారి మనమనసుకి

4 comments:

  1. అతకని తాడుని కతికేలా ముళ్ళెందుకు
    చక్కటి విశ్లేషణ దాంపత్యబంధం పై

    దక్కదని తెలిసాక తగని మక్కువెందుకు
    ఇక్కడే కదా ప్రాణి మాయలో చిక్కుకొనేది .


    దక్కనివాటిపై వ్యామోహమది విరహమేకాదు
    (దక్కనివాటిపై వ్యామోహమే అది విరహం కానే కాదు)ఇలా అంటే బాగుంటుందేమో .

    మనసుపడే తపన ఏం తెలుసు కలలుకనే కళ్ళకి
    చాలా చాలా బాగుంది . నిజానికి ఆకారమే లేని మనసు , ఆకారం ఉన్న కళ్ళను పట్టించుకోదు . ఈ మనసు పంద్రియాల కూర్పుతో (ప్రత్యేక) ఆకారం లేకుండా నామకరణం చేయించుకొని మన ఆ పంచేద్రియాలని ఆడిస్తున్నది .

    ReplyDelete
  2. మనసుపడే తపన ఏం తెలుసు కలలుకనే కళ్ళకి
    సర్దుకోక తప్పదు మనకీ మరోసారి మనమనసుకి

    baagaa cheppaaru Prerana gaaru.. appudappudu ilaa meeru buddhi cheppaali andariki..

    ReplyDelete
  3. సర్దుబాటు..కళ్ళతో చూసింది, చేరేది మనసుకే, మనసు కి డోలాయమానం తప్పదు!

    ReplyDelete
  4. జీవితం గురించి అందంగా చెప్పడంలో మీదైన స్టైల్ ఉందండి

    ReplyDelete