Thursday, August 15, 2013

జైహింద్...

చాలింక పాలద్రోలు నీ స్వార్ధచింతన
కాసింత పెంచు నీలో దేశభక్తి భావన
దేశం నీకేమిచ్చిందని వేయకు ప్రశ్న
నీవిచ్చిందేమిటో ఆలోచించు ఇకనైనా
ఏంచేయని నీకెందుకనవసర ఆక్రంధన
కనులు తెరచిచూడు ఆపి నీ ప్రేలాపన!!


అవినీతి అగ్నిగుండంలో కాలే కోరికల్నిలేపు
మత్తుబానిస మనిషయ్యే మార్గాన్ని చూపు
సంస్థలుమారినా సంఘర్షణతో నిరాశ చెందకు
మార్గన్ని మార్చిన నీవు గమ్యాన్ని మార్చకు
దేశపురూపాన్ని నీవు మార్చి వేలెత్తిచూపకు
దేశమే మనం అయ్యేలా చాకచక్యాన్నిచూపు
నిర్ధిష్టనీటిచుక్కలతో మారిన తూఫాన్నిచూపు


మంచి కొరకై చెడును ఎదిరించి చూడు
నీలోని నమ్మకపు ఖజాన తెరచిచూడు
సిరధమనుల రక్తాన్ని వేడెక్కించిచూడు
కలతలెరుగని దేశాన్ని కళ్ళెదుటచూడు
సాధనకై పట్టుదలతో ప్రయత్నించిచూడు
ఆకాశమే తలవంచి సలాం కొట్టేనుచూడు!!

4 comments:

  1. చాలా చాలా బాగుంది .

    ఏంచేయని నీకెందుకనవసర ఆక్రంధన ( నీకెందుకనవసరపు ఆక్రందన )
    కనులు తెరచిచూడు ఆపి నీ ప్రేలాపన!! ( కనులు తెరచిచూడు ఆ ప్రేలాపన ఆపి ) ఇక్కడ ప్రాస కొరకు ప్రాకులాడితే భావం బలహీన పడ్తుంది , కనుక అంగికరిస్తే కరెక్ట్ చేసి నా కమెంట్లలో లో ఈ లైన్లు తీసివేయవలసినదిగా సూచన . )
    అవినీతి అగ్నిగుండంలో కాలే కోరికల్నిలేపు ( లేపు కంటే మాపు బాగుంటుందేమో )

    మార్గన్ని( మార్గాన్ని )మార్చిన నీవు గమ్యాన్ని మార్చకు
    తల ఎత్తి తదేకదృష్టితో నింగినే చూడు
    ఆకాశమే తలవంచి సలాం కొట్టేనుచూడు!!

    ReplyDelete
  2. చాలా బాగుంది ప్రేరణ గారు.

    ReplyDelete
  3. జై భారత్ ప్రేరణ గారు... ఆలోచనాత్మక కవిత..

    ReplyDelete
  4. ఈ మధ్య చిట్టి పొట్టి కధలు మానేసి కవితలు మొదలెట్టారు....బాగున్నాయి ప్రేరణాత్మకంగా :-)

    ReplyDelete