Friday, August 23, 2013

!!నా నీవు!!

పారే సెలయేరులా
సూర్యుడి తొలికిరణంలా
జీవితాశయ సారానివి నీవు!

విరిసిన వెన్నెలలా
మృగనయనాల భీతిలా
జీవితాలంకరణ పిపాసివి నీవు!

నిర్మానుష్యపు తోడులా
ఎడారిలో ఒయాసిస్సులా
జీవితాన్న అమృతానివి నీవు!

పెదవిపై చిరునవ్వులా
అలసినమోముపై చినుకులా
జీవితానుగ్రహ బహుమతి నీవు!

నీవరోకాదు...నన్నిలా
అనుక్షణం వెంటాడే నీడలా
నాలోదాగిన ఆత్మస్థైర్యానివి నీవు!

3 comments:

  1. అనుక్షణం వెంటాడే నీడలా
    నాలోదాగిన ఆత్మస్థైర్యానివి నీవు
    చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete
  2. నీవరోకాదు...నన్నిలా
    అనుక్షణం వెంటాడే నీడలా
    నాలోదాగిన ఆత్మస్థైర్యానివి నీవు!...మనసుకు స్పృశించింది

    ReplyDelete
  3. ఎప్పటికీ ఇలాగే మీ ఆత్మస్థైర్యం మీ వెన్నంటి ఉండాలని కోరుతూ....

    ReplyDelete