Sunday, August 18, 2013

క్రొత్తనీరుకి ఆహ్వానం

ఎన్నో ఆశల్ని అదృశ్యంగా మూటకట్టుకుని
ఏదో సాధించేయాలన్న తపనతో సాగుతూ
ఆర్పేసాను అడ్డొచ్చిన మండేమాధ్యమాలని
ఆశల తనువు తగలబడినా ఆశతో నడుస్తూ
గుడ్డిగా నమ్మాను ఫలించని ఆత్మవిశ్వాసాన్ని
మనసుమమతల మధ్యయుధ్ధంలో నేనోడుతూ
మోముపై శింగారించాను బూటకపు విజయాన్ని
తనువు అనుక్షణం మనసు ప్రతిక్షణం నలుగుతూ
జ్ఞాపకాలనీడలో వెతుకుతున్నా మరణించని ఆశని
మండే వెలుగుని చూడలేక చీకటే నయమనిపిస్తూ
మరణాన్ని కౌగలించుకోవాలని మరలకాదు తప్పని
నిత్యం నేను మండుతూ మనసుని మభ్యపెడుతూ
నన్నునే ఓదార్చుకుంటూ ఆహ్వానిస్తున్నా క్రొత్తనీరుని!

6 comments:

  1. ఎన్నో ఆశల్ని అదృశ్యంగా మూటకట్టుకుని...జ్ఞాపకాలనీడలో వెతుకుతున్నా మరణించని ఆశని..very very nice lines mam

    ReplyDelete
  2. ఆశావహ దృక్పధమే విజయానికి తొలిమెట్టని చక్కగా చెప్పారు ప్రేరణ గారు..అభినందనలతో..

    ReplyDelete
  3. నిర్ధిష్టమైన అభిప్రాయాలని బంధించి చివరికి సర్దుబాటుతో ఆహ్వానం పలకడం కష్టమే !

    ReplyDelete
  4. బ్లాగ్ ప్రేరుకు తగినట్లుగా ప్రేరణాత్మకంగా ఉంటాయి మీ రచనలు.

    ReplyDelete
  5. మీరు నిర్ధిష్టంగా నిర్ణయాలు తీసుకున్నా, కాలానుగుణంగా కరిగిపోయే మనసు మీదని మీ వ్రాతల ద్వారా తెలిసింది :)

    ReplyDelete
  6. డియర్ సిస్టర్,
    రక్షా బంధన్ శుభాకాంక్షలు

    వెతగ్గా వెతగ్గా నాకో సరస్వతి పుత్రి లభించినందులకు ఉబ్బి తబ్బిబ్బయ్యాను. ఏంట్రోయ్ కోతలు బానే కోస్తున్నావ్ అనుకోకపోతే, మీతో పరిచయం మాకాత్మానందం. మీ అభిప్రాయం కోసం ....
    mallik1973@hotmail.co.uk

    ReplyDelete