Thursday, March 5, 2015

మానవ హోలీ

ఎరుపు పసుపు నీలి పచ్చ రంగులు కలిపెయ్

మనసుల మధ్య దూరాన్ని దోచే రంగులద్దేయ్

అహంకారాన్ని దహనం చేసి హోలీ ఆడేసెయ్

శత్రువుకి స్నేహపు రంగుల అర్థం వివరించెయ్

ధ్వేషమన్నదే కనబడని కారుణ్యాన్ని పూసేయ్

ప్రేమ పరిమళమద్ది పలురంగుల పిచకారీచెయ్

మతమేదంటే అన్నిరంగుల మానవత్వమనెయ్

రంగులన్నీ కలిసి మనిషిజాతి తెలుపని తెలిపెయ్

వసంతకేళోత్సవ శుభాకాంక్షలు మిత్రులందరికీ....

4 comments:

  1. జీవితం రంగులమయం అంటూనే మనిషి మనుగడకు ఒక నిర్వచనం చెప్పారు. బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. బాగుంది మీ హోళీ సందేశం

      Delete
    2. బాగుంది మీ హోళీ సందేశం

      Delete
  2. మంచి సందేశాన్ని ఇచ్చారు

    ReplyDelete