Friday, May 15, 2015

!!కోల్పోయి!!

బాల్యాన్ని కోల్పోయిన ఒంటరితనం మొదటిసారిగా

మరణించి, యవ్వనంలోకి పరకాయప్రవేశమే చేసి,

స్వేఛ్ఛనే హత్యచేసిన విధి వ్యంగ్యంగా నవ్వితే తెలిసె..

నన్నునే కోల్పోయిన ప్రతీసారి చచ్చి బ్రతకడమేనని

మరచిపోవడం తెలిసిన ప్రాణానికి ఇది కొత్తేం కాదని!

గుండె నుండి తోడిన గుప్పెడు కన్నీళ్ళు మోముపై

చల్లుకుని భారమేదో తీరెనన్న నా ఓదార్పులో తెలిసె..

బండబారి మదిలో లావా బడబాగ్నై మండుతుందని

పొంగి పొర్లిందంటే అస్తికల్లోనైనా అస్తిత్వం కానరాదని!

ఆలోచనలు కొండగాలికే రెపరెపలాడుతూ కీచుమంటే

చిట్లిన కనురెప్పలే మూతపడలేమని తెలిపితే తెలిసె..

భారమైన ఒంటిపై మట్టికప్పితేనే మనసు మరణమని

కోల్పోయి మరణించి లేచి మరల కోల్పోయి సాగాలని!

3 comments:

  1. కోల్పోతూ సాగించడం అనేది మంచి నిర్ణయం కొనసాగిపొండి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ.

    ReplyDelete
  2. జీవితం మొత్తం మీ కవితలో కూర్పుగా మారి ఒదిగిపోయింది

    ReplyDelete
  3. వేదనాభరిత జీవితసత్యం

    ReplyDelete