Friday, May 22, 2015

ఎలా!?

మిణుకు మిణుకుమంటూ మెరిసే దీపాలెన్నో...
వాటిని దేదీప్యమానంగా ఎలా వెలిగించను నేను?
తడారిపోయిన అధరాలపై వెలగని వత్తులలో...
సంతోషపు చమురు నింపి ఎలా నవ్వించను నేను?
నిరాశ్రయులైన పిల్లలు, జబ్బుపడ్డ తల్లులెందరో...
నీడనిచ్చి, తల్లడిల్లే తల్లివ్యాధిని ఎలా తగ్గించను నేను?
ధర్మంకర్మా నీతీనియమం అనే మాటల నీతులెన్నో...
మనిషిలోని మానవత్వాన్ని ఎలా మేల్కొల్పను నేను?
స్వఛ్ఛందంగా సేవ చేసేవారు కొందరున్నారు లోకంలో...
కావలసినవారికి సరైన సహాయం ఎలా అందించను నేను?
హంగు ఆర్భాటాలతో సమగ్ర సిగ్గులేని జీవితాలెందరివో...
మరమనిషిని మనిషికే దేవునిగా ఎలా చూపించను నేను?

6 comments:

  1. తడారిపోయిన అధరాలపై వెలగని వత్తులలో...
    సంతోషపు చమురు నింపి ఎలా నవ్వించను నేను
    మీలో దాగిన వేదన్ని ప్రస్పుటం చేసారు

    ReplyDelete
  2. మరమనిషిని మనిషికే దేవునిగా ఎలా చూపించను excellent expressions

    ReplyDelete
  3. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

    సంభాషణ అంతరాయానికి మన్నించగలరు, మహానుభావురాలైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

    సాయి రామ్ సేవక బృందం,
    తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
    సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
    * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

    ReplyDelete