Tuesday, May 26, 2015

జీవించు.


చదవడం నేర్చుకుంటే...
ప్రతిమనిషీ ఒక పుస్తకమే!
వ్రాయడం నేర్చుకుంటే...
నీ జీవితం కూడా ఒక గ్రంధమే!
జీవించడం నేర్చుకుంటే...
మనం లోకానికి ఒక ఆదర్శమే!
నీవు కృంగి పోతున్నావంటే...
భూతకాలంలో బ్రతుకుతున్నట్లు!
నీలో అతృత పెరుగుతుందంటే...
భవిష్యత్తు పై బోలెడు ఆశలున్నట్లు!
నీవు ప్రశాంతంగా జీవిస్తున్నావంటే...
ప్రస్తుతకాలంతో రాజీపడి హాయిగున్నట్లు!

3 comments:

  1. వేరొకరిని చదివే ముందు మనల్ని మనం చదుకోవాలేమోనండి.

    ReplyDelete