Tuesday, March 14, 2017

!!వాటి నైజం!!

నాటనివాడు చెట్టు నరికినా
వాలిపోయే వరకు నీడనిస్తుంది
అది ఎదిగిన చెట్టు నైజం...

నీరుని వృధాగా పారబోసినా
మురికి ఉంటే కడిగేస్తుంది
అది మంచినీళ్ళ తత్వం...

తొక్కి మొక్కునని గుడిమెట్లెరిగినా
దేవుని సన్నిధికి తీసుకెళుతుంది
గుడిమెట్లకున్న ఉదాత్త గుణం... 

2 comments:

  1. ఆణిముత్యాలాంటి వాక్యాలు బాగున్నాయి.

    ReplyDelete