బలమైన స్త్రీ ఎంత లోతుగా ఆలోచిస్తుందో
అంతకు రెట్టింపు ప్రేమను పంచుతుంది!!
ఎంత సున్నిత మృదువైన మనసు కలదో
అంతకు మించిన శక్తిసామర్ధ్యాలు కలది!!
ఎంత మనస్ఫూర్తిగా నవ్వులు చిందిస్తుందో
అంతే వ్యధను మదిలో దాచుకుంటుంది!!
ఎంత ఆచరణాత్మకంగా పనులు చేయగలదో
అంతగానే అధ్యాత్మికపై ధ్యాస పెడుతుంది!!
బలమైన మహిళ తనకు తానే సారాంశము
ప్రపంచము పొందిన వరానికి నిర్వచనము!!
స్త్రీ గురించి ఆమె బలం గూర్చి చెప్పింది అద్భుతం
ReplyDeleteపదాల్లో బలమున్న పోస్ట్.
ReplyDelete