ద్వేషం చేసిన దుష్ఫలమో లేక మనిషి గుణమో
జంతువులు రెండుగా విభజించబడ్దాయి..
ఆవులు హిందువు మేకలు ముస్లిం అయ్యాయి
మధుషాలలో మాత్రం మనిషి అవతారం అగుపడ
చెట్లూ పుట్టలు ఆకులూ అలములు కలతచెందాయి!
పక్షులు పావురాలు కూడా హిందు ముస్లింలైతే..
ఎలాగని ప్రశ్నిస్తూ ఎండిన గింజలు ఏడ్చాయి
కొబ్బరికాయ హిందూ ఖర్జూరం ముస్లిమైనట్లే తెలీదని
ఆకలిప్రేగు అసలు విభజన ఏమిటి? ఎందుకన్నాయి!
వేర్పాటు వాదులకు విడిపోవడం అచ్చొచ్చెనేమో..
కానీ..నా వాదనలు మాత్రం అత్యోత్సాహ పడనన్నాయి!
దేశం
ReplyDeleteబ్రష్టు
పట్టింది
లోతట్టు భావాలు ఆలోచనాజనకం.
ReplyDeleteఆకలిపేగుకు ముస్లిం హిందూ అనే బేధం లేదు కడుపునింపితే చాలు. మానవత్వాన్ని తట్టారు మీ అక్షరాలతో. మీ ఆలోచనలు ఉన్నతం పద్మారాణిగారు.
ReplyDelete