Friday, July 5, 2013

నడచిచూడు.

మనిషిగా మారిచూడు,
లోకమేమారి నీ మార్గమౌతుంది....
నిశ్చలంగా ముందు నువ్వు నిలబడు,
ఈ లోకమే నీదౌతుంది....
పరులకై కూడా కొంత పాటుపడు,
వారి జీవితమే నీకంకితమౌతుంది....
ప్రేమను పంచిచూడు,
పాషాణ హృదయమైనా పటాపంచలౌతుంది....
మంచిగమ్యాన్ని ఎంచినడు శూలాలుసైతం, 
పూలబాణాలై పాదాలపై పడుతుంది....
అపరిచితుడిగా పయనించు అప్పుడప్పుడు,
నీదైన జీవితం హాయిగా సాగిపోతుంది....
సమాధిచేసి నీలోని చెడు నిన్ను నీవు గుర్తిస్తే,

మానవజన్మకొక సార్థకత చేకూరుతుంది!!!!

3 comments:

  1. మీ వాక్యాలన్నీ ఆచరిస్తే లోకంలో అంతా మంచే కదా..

    ప్రేరణాత్మకమైన మీ పోస్ట్ చాలా బాగుంది పద్మారాణి గారు.. అభినందనలతో...

    ReplyDelete