Sunday, July 21, 2013

//జీవితం//

జీవితాన్ని శింగారించుకోవాలని..
నమ్మకాన్ని జ్యోతిగా వెలిగించాను
జీవితమెంతో అందం ఆనందమని
ఆదర్శాలని పూమాలగా అల్లాను
జీవితంలో అందరూ నావాళ్ళేనని
గుంపులో దాగి ఒంటరినయ్యాను
జీవితం పరచిన తివాచీ అనుకుని
నగ్నపాదాలతో నడవక నర్తించాను!

జీవితాన్ని దగ్గరగా చూడగలిగితే..
అప్పుడే జీవితాన్ని జీవించగలను
జీవితానందవ్యధని సమంగా భరిస్తే
అహ్లాదం అందులోనే కనిపించేను
జీవితానుభవ కళ్ళగంతలు విప్పితే
అసలు రూపమేదో అగుపించును
జీవితమే శాశ్వితం కాదని తలుస్తే
ప్రతీక్షణం విలువ ఎంతో తెలిసేను!

9 comments:

  1. జీవితాన్ని దగ్గరగా చూపారు

    ReplyDelete
  2. జీవితాన్ని దగ్గరగా చూడగలిగితే..
    అప్పుడే జీవితాన్ని జీవించగలను....అద్భుతంగా చెప్పారు

    ReplyDelete
  3. జీవితమే శాశ్వితం కాదని తలుస్తే
    ప్రతీక్షణం విలువ ఎంతో తెలిసేను!....అద్భుతమైన భావం

    ReplyDelete
  4. మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.

    www.poodanda.blogspot.com

    Reply

    ReplyDelete
  5. జీవితానికి మీ నిర్వచనం బాగుంది, మీ శైలి బాగుంది.

    ReplyDelete
  6. అందరికీ ధన్యవాదములు_/\_

    ReplyDelete