Tuesday, July 9, 2013

ఎందుకిలా!


కన్న కలలన్నీ అలిగి కళ్ళని వెలివేస్తే
నిదురించమని కనులని బ్రతిమాలనేల!
కోరిన కోరికలన్నీ అందకుండా చేజారిపోతే
గమ్యమే దారిమరచి దారి చూపమననేల!
అదృష్టద్వారమే తట్టవలసిన తలుపేదంటే
మార్గాలు ఎన్నుండిమాత్రం ప్రయోజనమేల!
జీవిత ఆశయమే ధూళిలో కలిసి ఎగిరిపోతే
మేల్కుని నవ్వుతూసాగమని ఉసిగొల్పనేల!

10 comments:


  1. ఎందుకిలా అన్నదానికి సమాధానం దొరికితే ఇక జీవితానికి ఓ చమక్కు తక్కువై పోతుందేమో మరి ! అందుకే ఈ ఎందుకిలా కి ఎప్పుడూ జవాబు దొరకదేమో మరి !

    జిలేబి

    ReplyDelete
  2. Good! చాలా బావుంది.

    ReplyDelete
  3. జీవిత ఆశయమే ధూళిలో కలిసి ఎగిరిపోతే
    మేల్కుని నవ్వుతూసాగమని ఉసిగొల్పనేల!నిజమే ఎందుకిలా?

    ReplyDelete
  4. జీవిత సత్యాలని అలవాటుచేసుకోవాలే కానీ ఇలా ప్రశ్నిస్తే ఎలాగండి!

    ReplyDelete
  5. జీవితం అంటే ఇలా....

    ReplyDelete
  6. చాలా బాగుంది....అందుకే కదా దాన్ని జీవితం అనేది పద్మ గారు.

    ReplyDelete
  7. కన్న కలలన్నీ అలిగి కళ్ళని వెలివేస్తే
    నిదురించమని కనులని బ్రతిమాలనేల!

    so cute feel Prerana garu..touching lines......

    ReplyDelete