Tuesday, July 23, 2013

బాలేదు

ఒడ్డుచేరి తెడ్డును మరువడం నచ్చలేదు
కాగితపు నావ నీట మునగడం బాలేదు
వర్షంలో ఆటలాడి తుమ్మడం గుర్తులేదు
అప్పటి తడి ఇప్పుడు చెడనడం బాలేదు

తనకై భావోధ్వేగాలని చంపడం నచ్చలేదు
స్వార్థై మనిషి మనిషిపై గెలవడం బాలేదు
మనిషి మృగంగా మారడంలో అర్థమేలేదు
జీవించాలని ఇతరుల్ని భాధించడం బాలేదు

ప్రేమకై తల్లిదండ్రులని వదలడం నచ్చలేదు
జీవితాన్నిచ్చినవారినే తప్పనడం బాలేదు
నీకంటనలుసేరి వాళ్ళు ఏడవడం జ్ఞప్తిలేదు
అటువంటివారిని రోజూ ఏడిపించడం బాలేదు

5 comments:

  1. Blogvedika LOGOS
    బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
    http://blogsvedika.blogspot.in/p/blog-page.html

    ReplyDelete
  2. బాలేదూ? ఎవరన్నారు?

    ReplyDelete
  3. బాగోనివి బాగోలేదని చక్కగా చెప్పారు.

    ReplyDelete
  4. మీరు చెప్పేవన్నీ అనుభపూర్వక సత్యాలు.

    ReplyDelete