Wednesday, July 31, 2013

ఏం సాధించేవు!

గోల చేసి గోడలు కట్టి ఏం సాధిస్తావు
వారధివేస్తే వందమందికి దారిచూపేవు

మనసు విరిచి మంచి మనుగడంటావు
కనులుమూసి పగటినేం రేయిగ
మార్చేవు

మేల్కొనిసాగక సోమరివై ఎందుకున్నావు
మాటలకన్న చేతలతో ఏదైనా సాధించేవు

చేతకాక చెప్పే సారంగ నీతులేం వింటావు
వంక లేక డొంకట్టుకుని వ్రేలాడుతున్నావు

పట్టుదలుంటే ఆశయానికి ఏవీ అడ్డురావు
అనుభవాల కళ్ళకి ఆదర్శాలు అచ్చిరావు

4 comments:

  1. గోల చేసి గోడలు కట్టి ఏం సాధిస్తావు
    వారధివేస్తే వందమందికి దారిచూపేవు. too good.

    ReplyDelete
  2. మీ మనసులోని వేదన మిళితమై వచ్చిన పదాలు కామోసు. చాలా బాగున్నాయి.

    ReplyDelete
  3. 'గోల చేసి గోడలు కట్టి ఏం సాధిస్తావు
    వారధివేస్తే వందమందికి దారిచూపేవు'.... చాలా బాగా చెప్పారండి

    ReplyDelete
  4. చాలా బావున్నాయి మీ రచనలు, పెయింటింగ్స్ చాలా చాల బావున్నాయి. థాంక్స్

    ReplyDelete